గుంటూరు జిల్లా మందడంలో ఏర్పాటు చేసిన మూడు రాజధానుల మద్దతుదారుల దీక్ష శిబిరాన్ని వెంటనే తొలగించాలని అమరావతి మహిళా ఐకాస నేతలు స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. మూడు రాజధానుల దీక్షకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద డీఎస్పీకి దరఖాస్తు చేశారు. పోలీసులు తమను నమ్మించి మోసం చేశారని మహిళా జేఏసీ నాయకురాలు పద్మశ్రీ ఆరోపించారు. అమరావతి రైతులపై కేసులు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
'మందడంలో మూడు రాజధానుల దీక్షా శిబిరాన్ని తొలగించాలి' - మూడు రాజధానుల దీక్షా శిబిరంపై మహిళా జేఏసీ
మూడు రాజధానుల మద్దతుదారులు గుంటూరు జిల్లా మందడంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని వెంటనే తొలగించాలని అమరావతి మహిళా ఐకాస నేతలు స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
'మందడంలో మూడు రాజధానుల దీక్షా శిబిరాన్ని తొలగించాలి'