జీఎన్‌రావు కమిటీ అంటే ఏంటో అనుకున్నానని.. ఇంతకు మునుపు అతను రాజధాని ప్రాంతం మునిగిపోతుందని చెప్పిన ఓ అవగాహన లేని కలెక్టర్ అని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. ఆనాడే అతన్ని నేను మందలించానని.. అతనేదో ఆకాశం నుంచి ఊడి పడినట్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పిందని ఎర్రబాలెంలో రైతులను కలిసిన సందర్భంగా ఎద్దేవా చేశారు. అనంతరం.. కేసులతో ఉన్న బోస్టన్ కంపెనీకి రాజధానిని చూసే బాధ్యతలు అప్పగించారని.. ఇప్పుడు హైపవర్ కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో భూముల ధరలు పెరిగితే ముఖ్యమంత్రికి ఇబ్బందేంటని ప్రశ్నించారు.
'జీఎన్‌రావు అంటే ఎవరో అనుకున్నా..!'
రాజధాని కోసం నియమించిన జీఎన్ రావు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా.. అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జీఎన్ రావు అంటే ఎవరో అనుకున్నానని.. అతనికి కనీసం రాజధానిపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
'జీఎన్‌రావు ఆకాశం నుంచి ఊడిపడ్డారా..?'