ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2019, 7:52 PM IST

ETV Bharat / state

పొన్నూరు కేబుల్ ప్రసార సంస్థల మధ్య వివాదం.. ఒకరిపై దాడి

గుంటూరు జిల్లా పొన్నూరు కేబుల్ ప్రసారాలపై రెండు సంస్థల ప్రతినిధుల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఒక సంస్థకు చెందిన కేబుల్ వైర్లను మరొకరు తొలిగిస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఒక సంస్థకు చెందిన వైర్లను మరో సంస్థ ప్రతినిధి కత్తిరిస్తుండగా ... అతణ్ని పట్టుకుని స్థానిక పోలీసు స్టేషన్​లో అప్పగించారు కొందరు వ్యక్తులు. కానీ తనపైన దాడిచేసి, తిరిగి కేసు పెట్టారని స్టేషన్​లో ఉన్న వ్యక్తి ఆరోపిస్తున్నారు.

పొన్నూరు కేబుల్ ప్రసార సంస్థల మధ్య వివాదం.. ఒకరిపై దాడి

పొన్నూరు కేబుల్ ప్రసార సంస్థల మధ్య వివాదం.. ఒకరిపై దాడి
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో కేబుల్ ప్రసారాలపై గత కొంతకాలంగా రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఓ సంస్థకు చెందిన ప్రతినిధి కేబుల్ ప్రసారాల వైర్లు కత్తిరిస్తున్నారని మరో సంస్థకు చెందిన ప్రతినిధులు ఆదివారం రాత్రి వంశీకృష్ణ అనే యువకుణ్ని పట్టుకుని పొన్నూరు గ్రామీణ పోలీసు స్టేషన్​లో అప్పగించారు. స్టేషన్​లో ఉన్న వంశీకి సోమవారం మధ్యాహ్నం ఛాతీ నొప్పి రావటం వలన అతణ్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఏం జరిగింది ?

గుంటూరు గ్రామీణ ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం వంశీకృష్ణ అనే వ్యక్తి పొన్నూరు పరిధిలోని కొండముది అనే గ్రామంలో కేబుల్ వైర్లు కత్తిరిస్తుండగా మరో సంస్థ ప్రతినిధులు అతణ్ని పట్టుకుని.. పోలీసు స్టేషన్​లో అప్పగించారు. స్టేషన్​లో ఉన్న వంశీకృష్ణకు ఛాతీ నొప్పి రావడం వలన ఓ ప్రైవేట్​ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీకృష్ణ మాట్లాడుతూ... అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో వైర్లు పరిశీలిస్తుండగా ఎనిమిది మంది వ్యక్తులు రెండు కార్లలో వచ్చి తనపై దాడిచేశారని ఆరోపించారు. తనపై యాసిన్ అనే వ్యక్తి, అతని సంబంధికులు దాడి చేశారంటూ.. బాధితుడు వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేసి.. రోజంతా చిత్ర హింసలు పెట్టారని వంశీ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని.. పోలీసులు రక్షణ కల్పించాలని వంశీ వేడుకున్నారు.

పొన్నూరు కేబుల్ ప్రసారాలపై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్నాయి. ఈ విషయమై సోమవారం సాయంత్రం ఏఎస్పీ చక్రవర్తి, బాపట్ల డీఎస్పీ.. పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్​లో ఇరువర్గాలతో మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తి విచారణ ఇంకా చేయాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.

ఇదీ చదవండి :

'ధనలక్ష్మి దోచేసింది.. న్యాయం చేయండి'

ABOUT THE AUTHOR

...view details