ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశంలో అనేక అక్రమ కట్టడాలు నేలమట్టం అయ్యాయి, మరి రుషికొండ విషయంలో అదే జరిగితే ప్రజాధనం వృథాకు బాధ్యులెవరు? - Violations at Rushikonda

Buildings Demolition Constructed Against Norms: రుషికొండపై అక్రమ నిర్మాణాల భవితవ్యం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఏం చేయబోతోందనేది.. కీలకంగా మారింది. గతంలో ఇలాంటి ఉల్లంఘనలపై జోక్యం చేసుకున్న న్యాయస్థానాలు.. అక్రమ కట్టడాలను నేలమట్టం చేయించాయి. ఒకవేళ అదే అనివార్యమైతే..వందల కోట్ల ప్రజాధానం వృథాకు బాధ్యులెవరు.?

Buildings_Demolition_Constructed_Against_Norms
Buildings_Demolition_Constructed_Against_Norms

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 9:08 AM IST

Updated : Nov 2, 2023, 9:57 AM IST

Buildings Demolition Constructed Against Norms: దేశంలో అనేక అక్రమ కట్టడాలు నేలమట్టం అయ్యాయి, మరి రుషికొండ విషయంలో అదే జరిగితే ప్రజాధనం వృథాకు బాధ్యులెవరు?

Buildings Demolition Constructed Against Norms: కేరళలోని మరడు ప్రాంతంలో.. సీఆర్​జెడ్ (Coastal Regulation Zone) నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన 4 పెద్ద అపార్ట్‌మెంట్లకు.. సీఆర్​జెడ్-3 పరిధిలోకి వచ్చే.. ఆ ప్రాంతంలో నిర్మాణాలకు కేరళ కోస్టల్‌జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ.. అనుమతివ్వాలి. కానీ అవేమీ పట్టించుకోకుండానే స్థానిక పంచాయతీ అనుమతిచ్చింది.

అయితే.. నిర్మాణాలు ఆపాలని బిల్డర్‌కు కేరళ ప్రభుత్వం నోటీసులిచ్చింది. కానీ.. బిల్డర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. ఇక బిల్డర్లు.. చకచకా నిర్మాణాలు పూర్తిచేసి విక్రయించేశారు. హైకోర్టు తీర్పును.. కేరళ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సుప్రీంలో సవాల్‌ చేసింది. అవి అక్రమ కట్టడాలేననన్న సర్వోన్నత న్యాయస్థానం కూల్చివేతలకు ఆదేశాలిచ్చింది. రెండేళ్ల క్రితం ఆ 4 అపార్ట్‌మెంట్లను కూల్చేశారు.

నాడు ప్రజావేదిక కూల్చారు, మరి నేడు రుషికొండ విషయంలో అడుగడుగునా నిబంధనలకు తూట్లు

అదే విధంగా కేరళలో 200 కోట్ల రూపాయలతో నిర్మించిన రిసార్ట్‌.! నెడియాతురుత్‌ ద్వీపం బ్యాక్‌వాటర్స్‌లో విలాసవంతమైన విల్లాలు నిర్మించారు. ముత్తూట్‌, కపికో గ్రూపులు సంయుక్తంగా 2007లో వీటిని నిర్మిచారు. సీఆర్​జడ్ (CRZ) నిబంధనలు.. పర్యావరణ చట్టాల్ని ఉల్లంఘించారని కొందరు స్థానికులు పిటిషన్ వేయడంతో.. కూల్చివేతకు 2013లో.. కేరళ హైకోర్టు ఆదేశించింది. యాజమాన్యం సుప్రీంకోర్టుకెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ రిసార్ట్‌నను కూల్చేయాలని.. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో.. గతేడాదే వీటిని నేలమట్టం చేశారు.

ఇక నోయిడాలోని ట్విన్‌టవర్స్‌కూ.. అదేగతి పట్టింది. ఉద్యాన అభివృద్ధికి కేటాయించిన స్థలంలో సూపర్‌టెక్‌ సంస్థ అనుమతులు రాక ముందే.. 40 అంతస్తులతో కూడిన రెండు టవర్లు నిర్మించింది. అవి అక్రమ నిర్మాణాలని అలహాబాద్‌ హైకోర్ట్‌, సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో గతేడాది ఆగస్టులో.. ఈ ట్విన్‌ టవర్స్‌ను కూల్చేయక తప్పలేదు.

Luxury Buildings in Visakhapatnam for CM Jagan: జనం సొమ్ముతో.. సీఎం జగన్ సోకులు!

వీటి తరహాలోనే నిర్మించిన మన రుషికొండ పరిస్థితేంటి? ఇక్కడా.. అన్నీ ఉల్లంఘనలేనని ఇప్పటికే కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ.. తేల్చింది. రుషికొండపై నాలుగు బ్లాకుల్లోనూ సీఆర్​జడ్ ఉల్లంఘనలు జరిగాయి. 2021లో.. తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా.. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు భవనాలు నిర్మిస్తున్నారు. సీఆర్​జడ్ నిబంధనల ప్రకారం మార్కింగ్‌కు.. గజం స్థలం మారినా మళ్లీ అనుమతి తీసుకోవాలి. కానీ.. తీసుకోలేదు. 9.98 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి పొంది ఏకంగా.. 17.96 ఎకరాల్లో పనులు చేపట్టారు. ఆ ఉల్లంఘనల తీవ్రత తేల్చాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు ఏపీ హైకోర్టు ఇటీవలే ఆదేశాలిచ్చింది. తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది.

సీఆర్​జడ్ నిబంధనల ఉల్లంఘనపై కేరళ తరహాలోనే లెక్క సరిచేయాలని.. డిమాండ్‌ చేస్తున్నారు విశ్రాంత ఐఏఎస్ శర్మ. ఈ మేరకు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి లీనా నందన్‌కు లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో 350 కోట్ల రూపాయలతో చేపట్టిన కట్టడాల భవితవ్యం ఏంటి? ప్రజాధనం వృథాకు బాధ్యత ఎవరు వహిస్తారో తేలాల్సి ఉంది.

Construction of Wall Around Rushikonda : నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం..

Last Updated : Nov 2, 2023, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details