బిల్డ్ ఏపీ మిషన్ కింద ఇ- ఆక్షన్‌కు పెట్టిన భూముల అమ్మకాల తేదీని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. విశాఖ, గుంటూరులోని భూముల వేలాన్ని జూన్ 11 వరకు పొడిగిస్తూ బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో విశాఖలో 6, గుంటూరులో 3 స్థలాలు అమ్మాలని నిర్ణయించారు. అయితే వివిధ వర్గాల అభ్యర్థనల మేరకు 15 రోజుల పాటు అమ్మకాల తేదీని పొడిగించినట్లు వెల్లడించారు. విక్రయించే 9 స్థలాల వివరాలను ఎన్‌బీసీసీ ఇండియా, ఏపీ గవ్ డాట్ ఇన్‌లో చూడవచ్చని బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ తెలిపారు.
బిల్డ్ ఏపీ భూముల వేలానికి గడువు పొడిగింపు - బిల్డ్ ఏపీ భూముల వేలం వాయిదా
బిల్డ్ ఏపీ మిషన్ కింద ఇ- ఆక్షన్‌కు పెట్టిన భూముల అమ్మకం వాయిదా పడింది. విశాఖలో 6, గుంటూరులో 3 స్థలాల విక్రయాన్ని జూన్ 11 వరకు పొడిగించారు బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్.
build ap e- action date extended