ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షంతో నేలకొరిగిన విద్యుత్ స్తంభం.. ఆరు గేదెలు మృతి - గుంటూరులో విద్యుత్ షాక్ తో గేదెలు మృతి

విద్యుత్ షాక్​కు గురై ఆరు గేదెలు మరణించాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మేతకు వెళ్లిన పశువులు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో జరిగింది.

buffaloes died
buffaloes died

By

Published : Sep 18, 2020, 9:02 AM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో విద్యుత్ షాక్​కు గురై ఆరు గేదెలు చనిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొత్తపాలెం గ్రామంలో ఓ విద్యుత్ స్తంభం పడిపోయింది. మేత కోసం వెళ్లిన పశువులు వర్ష ప్రభావానికి తిరిగి వచ్చే క్రమంలో విరిగి పడిన విద్యుత్ స్తంభం తీగలు తగిలి షాక్ గురయ్యాయి. ఈ ఘటనలో 6 గేదెలు అక్కడికి అక్కడే మరణించాయి.

వర్ష ప్రభావం తగ్గిన తరువాత గమనించిన స్థానికులు పశువుల యజమానులకు, విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. సాయంత్ర సమయంలో ప్రమాదం జరిగి వర్షం నిలిచిన కూడా.. సంబధిత అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు గాని.. మరమ్మతులు చేసి తెగిన తీగలను తొలగించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరే ప్రమాదానికి కారణమని మండి పడుతున్నారు. ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల వరకు నష్టం కలిగినట్లు బాధితులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details