గుంటూరు జిల్లా నగరం మండలంలో విద్యుత్ షాక్కు గురై నాలుగు గేదెలు చనిపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ క్రమంలో మేతకు వెళ్లిన పశువులకు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు.. అధికారుల తీరును తప్పుబట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్తో నాలుగు గేదెలు మృతి - guntur district crime
గుంటూరు జిల్లా నగరంలో కరెంట్ షాక్కు గురై నాలుగు గేదెలు మృతి చెందాయి. పొలంలో మేతకు వెళ్లిన పశువులకు విద్యుత్ తీగలు తగలడంతో అవి మృత్యువాతపడ్డాయి.

విద్యుత్ షాక్తో నాలుగు గేదెలు మృతి