మాచర్ల ఘటనపై మాట్లాడుత్న బుద్దా వెంకన్న డ్రైవర్
'మేము ఒక్క క్షణం ఆగి ఉన్నా మమ్మల్ని చంపేసేవారు' - వైకాపా శ్రేణుల దాడిపై బుద్దా వెంకన్న డ్రైవర్
గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో వైకాపా శ్రేణులు తమ వాహనాలపై దాడి చేశారని.. ఇందులో తమ నేతలకు గాయాలయ్యాయని తెదేపా నేత బుద్దా వెంకన్న డ్రైవర్ శ్రీను వెల్లడించారు. బొండా ఉమా కారులోనే బుద్దా వెంకన్న, గన్ మన్ ఉన్నారని.. దాడి సమయంలో గన్‌మెన్ కిందకుదిగి ఆందోళనకారులపై తుపాకీ ఎక్కుపెడితే అతనిపైనా దాడి చేశారని తెలిపారు. కొంత దూరం వెళ్ళాక పోలీసులు రక్షణగా వచ్చి వారి వాహంలోకి తమ నేతలను ఎక్కించుకున్నారని చెప్పారు. పోలీసు వాహనంపైనా దాడి జరిగిందన్నారు. క్షణం ఆగి ఉంటే చంపేసేవారని ఆవేదన చెందారు.

మాచర్ల ఘటనపై మాట్లాడుత్న బుద్దా వెంకన్న డ్రైవర్