"ప్రధాని మోదీ దేశానికి కాపలాదారు కాదు... జగన్ అవినీతికి కాపలాదారుడు.. జగన్‌ను కాపాడాలని సీబీఐకి ప్రధాని మోదీ నుంచి హుకుం జారీ అయింది. నిజయతీగా ఉన్న కంపెనీలపై మాత్రం దాడులు చేయిస్తారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వారికి తగిన బుద్ధి చెప్తారు." బుద్ధా వెంకన్న, ప్రభుత్వ విప్
బుద్ధా వెంకన్న
By
Published : Mar 13, 2019, 5:38 PM IST
బుద్ధా వెంకన్న
ప్రధాని మోదీ దేశానికి కాపలాదారు కాదని.. జగన్ అవినీతికి కాపలాదారుడని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను సీబీఐ ఎందుకు అరెస్టు చేయట్లేదని ప్రశ్నించారు. వైకాపా అధ్యక్షుడిని కాపాడాలని సీబీఐకి ప్రధాని నుంచి హుకుం జారీ అయిందని ఆరోపించారు. నిజాయతీగా ఉన్న కంపెనీలపై మాత్రం దాడులు చేయిస్తారని మండిపడ్డారు. ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారనీ... వాళ్లే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఇవాళ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తానని చెప్పి మళ్లీ వాయిదా వేశారని... దొంగతనం బయటపడేసరికి భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.సాక్ష్యాధారాలతో సహా మీడియాలో వార్తలు వచ్చేసరికి జగన్వణికిపోతున్నారన్నారు. ఇలాంటి పెద్ద కుంభకోణాలు బయటపడుతున్నప్పుడు జగన్‌ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దోచుకుని దాచుకోవడం జగన్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.