Save Arya Vaishya: దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పదవిలో ఉన్నప్పుడు అందినకాడికి డబ్బును దోచుకున్నారని తెదేపా నేతలు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు ఆరోపించారు. పదవి పోయాక కూడా ఆర్యవైశ్యుల వ్యాపారాలను సైతం వదిలి పెట్టలేదని ఆరోపించారు. వెలంపల్లి ఆరాచకాలతో నష్టపోతున్న ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు.
వెల్లంపల్లి అరాచకాలకు బలవుతున్న ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం: తెదేపా - Ex minister Vellampalli Srinivas was robbed
Save Arya Vaishya: రాష్ట్రంలో వైకాపా నాయకుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని తెదేపా నేతలు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా ఆరోపించారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పదవి పోయినా కూడా దోచుకోవడం ఆపలేదని ఎద్దేవా చేశారు. ఆర్యవైశ్యుల వ్యాపారాలను సైతం వదిలి పెట్టలేదని ఆరోపించారు.
సేవ్ ఆర్యవైశ్యుల నినాదంతో పోరాడతామని తెలిపారు. ఆర్యవైశ్యుల వ్యాపారాలు కొల్లగొడుతున్న వెలంపల్లిపై జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనకళ్ల విద్యాధరరావు, కొండపల్లి బుజ్జిలు వెలంపల్లికి కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెలంపల్లి వెనుక ఉన్న ముఖ్యమంత్రే దందాలకు మూలమని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనేయొచ్చని వైకాపా నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీల పట్ల వైకాపా చూపే కపట ప్రేమను ఎవ్వరూ నమ్మట్లేదని నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: