ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - గుంటూరు తాజా సమాచారం

పురుగుల మందు తాగి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

B.Tech student committed suicide in sattanapalli
పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

By

Published : Nov 25, 2020, 8:11 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తెనపల్లిలోని ఓ ప్రముఖ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న గాదె శ్రీనివాసరావు ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details