ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి'

అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ బీటెక్ రవి డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. తుళ్లూరులో రైతుల ధర్నా శిబిరాన్ని బీటెక్‌ రవి సందర్శించారు.

btech ravi on amaravathi
అమరావతిపై బీటెక్ రవి

By

Published : Aug 3, 2020, 12:30 PM IST

వైకాపా మేనిఫెస్టోలో మూడు రాజధానులు చేస్తామని చెప్పలేదని బీటెక్‌ రవి అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు. తుళ్లూరులో రైతుల ధర్నా శిబిరాన్ని ఎమ్మెల్సీ బీటెక్ రవి సందర్శించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించారు. ఇవాళ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పించనున్నారు.

తుళ్లూరులో రైతుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ బీటెక్ రవి

అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి రాజీనామా చేస్తామని చెప్పాలన్నారు. వైకాపా చేసిన చట్టంలో ఎక్కడ కూడా జ్యూడీషియల్‌ అనే పదమే లేదని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: ' రైతులకిచ్చిన హామీలకు సర్కారుదే పూచీ.. వెనక్కు తగ్గడానికి వీల్లేదు'

ABOUT THE AUTHOR

...view details