ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో బీఎస్​ఎన్​ఎల్​ 4జీ సేవలు ప్రారంభం - 200 కోట్లు

రాజధాని జిల్లా కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ఏపీ సర్కిల్ సీజీఎం పూర్ణచంద్రరావు ప్రారంభించారు. ఏపీలో సేవలను విస్తరించేందుకు రూ.200 కోట్లు కేటాయించినట్లు సీజీఎం తెలిపారు.

bsnl_4g_services_started_by_ap_cgm_purnachandrarao

By

Published : Jul 11, 2019, 11:22 PM IST

గుంటూరులో బీఎస్​ఎన్​ఎల్​ 4జీ సేవలు ప్రారంభం

గుంటూరు చంద్రమౌళి నగర్​లోని టెలికాం కార్యాలయంలో 4జీ సేవలను ప్రారంభించిన అనంతరం సీజీఎం పూర్ణచంద్రరావు మాట్లాడారు. మొదటి ముడు నెలల్లో మొబైల్ కనెక్షన్లు 2.50 లక్షలు కొత్తగా యాడ్ అయ్యాయని తెలిపారు. ల్యాండ్ లైన్​లలో నాణ్యమైన సేవలు అందించటంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 500 నూతన 4జీ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గుంటూరు నగరంలో 78 టవర్లు 4జీ లో ఉన్నాయని, విజయవాడలో వారంలో 4జీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీలో సేవలను విస్తరించేందుకు 200 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details