ప్రేమ వ్యవహారంలో ఓ యువతి చివరకు ఓ ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. గుంటూరులో రెండేళ్ల క్రితం జరిగిన ఈ విషాద ఘటన ఇపుడు ఆలస్యంగా వెలుగు చూసింది. రెండేళ్లు గడిచినా తమ కుమార్తె ఆచూకీ తెలియటం లేదని ఇటీవల బాధితురాలి తల్లిదండ్రులు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి స్పందనలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాత గుంటూరుకు చెందిన 25 ఏళ్ల యువతి నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సాంకేతిక విద్య అభ్యసించింది. అదే కళాశాలలో చదివే కరీంతో తొలుత ప్రేమలో పడింది. తర్వాత రఫీ అనే యువకునికి దగ్గరైందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రఫిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం మొదటి ప్రేమికుడు కరీం తెలుసుకుని పెళ్లికి అడ్డు పడ్డారని పోలీసువర్గాల సమాచారం. రఫీతో పెళ్లికి సిద్ధమైన విషయం వారి కుటుంబ పెద్దలకు కరీం చేరవేశారని అంటున్నారు.
యువతి తల్లిదండ్రులు స్పందించి పోలీసులను ఆశ్రయించటం, వెంటనే రఫీ ఆ యువతిని తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో కుటుంబీకులకు అప్పగించగా తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లటంతో అప్పట్లో వ్యవహారం సద్దుమణిగింది. తిరిగి కొన్నాళ్ల తర్వాత ఆ యువతి ఉద్యోగం చేయటానికి బయటకు రాకపోకలు సాగిస్తూ మొదటి ప్రేమికుడు కరీంకు దగ్గరై పెళ్లి చేసుకోవాలని కోరింది. సరేనన్న అతను గుంటూరు ఆలీనగర్ ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని ఆమెతో ఉన్నాడు. అయితే తనతో పాటు మరో యువకునితోనూ ప్రేమాయణం సాగించిన ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక గదిలోనే బంధించి గోడ కేసి తల పగలగొట్టి, గొంతు నులిమి, చాకుతో పీక కోసి క్రూరంగా చంపినట్లు తాజా పోలీసుల విచారణలో బయటపడింది. ఇవేం బయటకు పొక్కకుండా, పోలీసుల దృష్టికి వెళ్లకుండా అతను అత్యంత గోప్యంగా వ్యవహరించాడు.
తేలిగ్గా తీసుకున్న పోలీసులు..