ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పు చెల్లిస్తానని నమ్మించాడు... అదును చూసి చంపేశాడు

By

Published : Nov 25, 2019, 11:16 PM IST

అప్పు చెల్లిస్తానని చెప్పి.. పొలాల్లోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గరికపాడులో జరిగింది.

అప్పు చెల్లిస్తానని నమ్మించాడు...అదును చూసి చంపేశాడు

అప్పు చెల్లిస్తానని నమ్మించాడు...అదును చూసి చంపేశాడు

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గరికపాడులో దారుణం జరిగింది. అప్పుగా తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని కోరగా .... డబ్బు ఇస్తానని నమ్మబలికి పొల్లాలోకి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. గ్రామానికి చెందిన పాటిబండ్ల కృష్ణ ప్రసాద్ మూడేళ్లు కిందట గాదెవారిపాలేనికి చెందిన పిడుగు గోపికృష్ణ అనే వ్యక్తికి రెండున్నర లక్షల నగదు అప్పుగా ఇచ్చాడు. డబ్బు చెల్లించాలని కృష్ణ ప్రసాద్ నెల రోజులుగా గోపీకృష్ణను అడుగుతున్నారు. అయితే నగదు చెల్లిస్తానని కృష్ణప్రసాద్ ను గ్రామశివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి... విచక్షణ రహితంగా కొట్టి హతమార్చాడు గోపీకృష్ణ. తరువాత క్రోసూరులోని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details