adani issue in parliament : పార్లమెంటులో అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక అంశంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉభయసభల్లో ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. దాంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
పార్లమెంట్‌లో హిండెన్‌బర్గ్ నివేదిక రగడ .. మరోసారి బీఆర్ఎస్ వాయిదా తీర్మానం - telangana in parliament
adani issue in parliament : పార్లమెంటు ఉభయ సభల్లో అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనివల్ల గత వారంలో రెండుసార్లు ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. తాజాగా ఈ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ , డీఎంకే పార్టీలు ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చారు.
![పార్లమెంట్‌లో హిండెన్‌బర్గ్ నివేదిక రగడ .. మరోసారి బీఆర్ఎస్ వాయిదా తీర్మానం adani issue in parliament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17679354-906-17679354-1675663961295.jpg)
ఈ క్రమంలో ఉభయసభల్లో అదానీ-హిండెన్‌బర్గ్ రిపోర్టుపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇండియన్ వర్క్ నివేదిక ఆధారంగా సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. ఈ అంశం పైనే మరికాసేపట్లో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్షాలు భేటీ కానున్నాయి. ఉదయం నుంచి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించాయి. తదుపరి కార్యాచరణను ఈరోజు చర్చించి ఖరారు చేయనున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్‌తో పాటు డీఎంకే పార్టీ కూడా ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చాయి.
ఇవీ చదవండి :