గుంటూరు జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు శిక్షణ ప్రారంభమైంది. కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. కాస్తంత విజ్ఞానాన్ని పొందేందుకు పాఠశాల విద్యాశాఖ బ్రిడ్జి కోర్సులను రూపొందించారు.. అందులో భాగంగా రెండు స్థాయిలలో పుస్తకాలను తయారు చేశారు.
జిల్లాలో ప్రారంభమైన బ్రిడ్జి కోర్సు - bridge coures taja news in guntur dst
లాక్ డౌన్ కారణంగా విద్యార్థులు పాఠశాల ఊసే మరిచారు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా విజ్ఞానాన్ని పొందేందుకు పాఠశాల విద్యాశాఖ బ్రిడ్జి కోర్సులను ప్రారంభించింది. గుంటూరు జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు కోర్సు శిక్షణ ప్రారంభించారు.
bridge course started in guntur dst from 1st to 5th class students
ఒకటవ స్థాయి పుస్తకాలను 1, 2 తరగతుల విద్యార్థులకు, రెండవ స్థాయి పుస్తకాలనూ 3,4,5 తరగతుల విద్యార్థులకు పంపిణీ చేశారు. అందులో రూపొందించిన అంశాలను విద్యార్థులు సప్తగిరి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు 1,2 తరగతుల విద్యార్థులు ,11:30 నుంచి 12 గంటల వరకు 3,4,5 విద్యార్థులకు బోధిస్తారు.
TAGGED:
gutur dst studnets taja news