Bride Committed Suicide: ఆ తల్లిదండ్రులు తమ కూతురి విహహం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు, మిత్రుల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తెల్లవారితే వివాహం.. రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పెళ్లి కుమార్తె - ఉరి వేసుకుని పెళ్లికుమార్తె ఆత్మహత్య
Bride Committed Suicide: ఆ ఇంట్లో మరి కొన్ని గంటల్లో వివాహం. వివాహం కోసం ఆ ఇంటి పెద్దలు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇల్లంతా బంధువులతో, పెళ్లి పనులతో హడావుడిగా ఉంది. పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. అంతలోనే పెళ్లి కుమార్తె ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది.
నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ర్యాగల రవళిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోశ్తో పెళ్లి నిశ్చయం చేశారు. ఈరోజు నిజామాబాద్లో 12:15 నిమిషాలకు వివాహం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇంతలోనే పెళ్లి కుమార్తె రవళి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.పెళ్లి కుమారుడు మానసికంగా వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: