ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాళీ కడుపుతోనే బడికి... చిన్నారులు అనారోగ్యం ఒడికి - undefined

ఉదయం అల్పాహారం.. ఆరోగ్యదాయకం. మధ్యాహ్నం, రాత్రి కంటే ఉదయం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యానికి ఎక్కువగా మేలు చేకూరుతుందని వైద్యులు సైతం చెబుతుంటారు. పేదల్లో ఉదయం అల్పాహారానికి దూరంగా ఉండేవారే ఎక్కువే. ఆయా కుటుంబాల నుంచి బడికి వెళ్లే చిన్నారుల పరిస్థితి మరింత దయనీయం. ఇలాంటి పరిస్థితిల్లో ఉదయం ఖాళీ కడుపుతోనే పాఠశాలకు వస్తున్నారు.

'అల్పాహారం అందక...ఆరోగ్యానికి దూరంగా'

By

Published : Jul 28, 2019, 6:55 AM IST

'అల్పాహారం అందక...ఆరోగ్యానికి దూరంగా'
అల్పాహారం తీసుకొకుండా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఒకటి నుంచి ఐదొ తరగతి చదివే చాలా మంది విద్యార్థులు అల్పహారం తీసుకోకుండా పాఠశాలకు వెళ్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క మండలంలోని కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 22 శాతం మంది విద్యార్థులు ఉదయం ఎలాంటి అల్పాహారం తీసుకోవటం లేదు. ఇదే విషయాన్ని మధ్యాహ్న భోజన పథకంపై వేసిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సమీక్ష కమిటీ నివేదికలో పేర్కొంది. గతేడాది ఈ కమిటీ నవంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు సమీక్ష నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలోని 53 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సర్వే నిర్వహించింది. సకాలంలో ఆహారం తీసుకోకపోవటంతో విద్యార్థుల్లో.. వయసుకు తగ్గ పొడవు, బరువు లేకపోవడం, అనారోగ్య సమస్యలు వంటి తదితర అంశాలను గుర్తించారు. ఆయా జిల్లాలో మొత్తం 659 మంది విద్యార్థులను పరిశీలించగా వారిలో వయసుకు తగ్గ బరువు లేని వారి సంఖ్య 320 ఉన్నట్లు గుర్తించారు.


ఉదయం పూట అల్పాహారం అందించే పథకం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తే విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పౌష్టికాహారం అందటంతో పిల్లలు చదువుపై దృష్టి సారించి వారి ఉజ్వల భవితకు బాటలు వేయోచ్చని భావిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details