పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై అర్చక బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరు బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏపీ అర్చక సమాఖ్య - బ్రహ్మణ చైతన్య వేదిక - బాలాజీ భక్త బృందం సంయుక్త ఆధ్వర్యంలో సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ... మంత్రి కొడాలి నాని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశ్వాసాలను... దేవాలయ సాంప్రదాయాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హిందూ ధర్మం పట్ల చేస్తున్న తప్పులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కొడాలి నాని వ్యాఖ్యలపై బ్రహ్మణ సంఘాల ఆగ్రహం - bramana organaisations fire on minister kodali nani news
తిరుమలపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను అర్చక బ్రహ్మణ సంఘాల నేతలు తప్పుబట్టారు. దేవాలయ సాంప్రదాయాలను కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
bramana-organaisations-fire-on-minister-kodali-nani