గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శ్రీరామాయణ నవాహ్నిక జ్ఞానయజ్ఞం ట్రస్ట్ వ్యవస్థాపకులు విష్ణుభట్ల ఆంజనేయ చయానికి యాజులు.. తన ఇద్దరు కుమారులతో కలిసి వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌లో 120 రోజుల పాటు నిత్యం అన్నదానం చేసిన ఈ కుటుంబం..ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. కొవిడ్ బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నవారికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు.
కొవిడ్ బాధితుల కడుపు నింపుతూ.. - food supply to corona patients at tenlai
అవసరంలో ఉన్నవారి ఆకలి తీర్చడమంటే..ఆ దేవుడికి నైవేద్యం పెట్టినట్టే..! ఈ మాటను అక్షరాలా పాటిస్తోంది..తెనాలిలోని ఓ కుటుంబం. గతేడాది లాక్‌డౌన్‌లో వందలాది పేదల కడుపు నింపిన వారు.. ఇప్పుడు కొవిడ్ బారినపడ్డవారి ఇంటికే ఆహారాన్ని అందిస్తున్నారు.
brahmin family helping covid family at guntur district tenali
భోజనాన్ని స్వయంగా తయారు చేయడమే కాక.. దాన్ని ప్యాక్ చేసి పట్టణ నలుమూలల్లో ఎవరడిగినా వారికి చేరవేస్తున్నారు. ఎవరు ఎంత కావాలన్నా.. లేదనకుండా పంపిణీ చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. కేవలం ఆహారమే కాక.. బాధితులకు మందులు, మాస్కులు, శానిటైజర్లూ వీరు అందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఏపీ నుంచి వెళ్లే కొవిడ్ రోగులను అనుమతించని తెలంగాణ
Last Updated : May 10, 2021, 2:01 PM IST