BP Mandal idol unveiling program: గుంటూరులో ఈ నెల 12న.. బీపీ మండల్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. విగ్రహావిష్కరణ అనంతరం.. బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా.. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి బీసీ నేతల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇదే వేదిక నుంచి.. బీపీ మండల్ సిఫార్సులను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు.. బీసీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీపీ మండల్ అనేక సిఫార్సులు చేశారని నాయకులు గుర్తుచేసుకున్నారు. వాటిని అమలు చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ నెల 12న బీపీ మండల్ విగ్రహావిష్కరణ.. బీసీల ఆత్మగౌరవ సభ - BP Mandal idol unveiling event in Guntur
BP Mandal idol unveiling program: బీపీ మండల్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గుంటూరులో ఈ నెల 12న జరగనుంది. విగ్రహావిష్కరణ అనంతరం బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు కోరారు.
బీపీ మండల్
"దేశంలోని అన్ని వర్గాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్న ఈ వెనుకబాటుతనం పోవాలి. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. ఇలా అనేక డిమాండ్లు ఉన్నాయి". - కొల్లు రవీంద్ర, టీడీపీ నేత
ఇవీ చదవండి: