ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లింగంగుంట్లలో అమానుషం... బాలుడిని దారుణంగా హత్య చేసిన పిన్ని - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో అమానుషం జరిగింది. అక్క పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన ఓ మహిళ ఆమె కుమారుడిపై ఘాతుకానికి ఒడిగట్టింది. అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపేయడమే కాకుండా.... పొట్టలో పేగులు, గుండె తీసి రక్తం తాగింది. పాశవికమైన ఈ ఘటనతో స్థానికంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది.

boy murdered in lingamguntla guntur district
లింగంగుంట్లలో అమానుషం... బాలుడిని దారుణంగా హత్య చేసిన పిన్ని

By

Published : Oct 4, 2020, 8:11 PM IST

లింగంగుంట్లలో అమానుషం... బాలుడిని దారుణంగా హత్య చేసిన పిన్ని

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో దారుణం జరిగింది. సొంత అక్క కుమారుడిని ఓ మతిస్థిమితం లేని మహిళ ఆసియా కిరాతకంగా గొంతు కోసి చంపింది. అనంతరం అమానుషంగా బాలుడి పొట్టలో పేగులు, గుండె తీసి రక్తం తాగింది. అదే సమయంలో అక్కడే ఉన్న మరో నలుగురు పిల్లలతో పాటు ఓ 8 సంవత్సరాల పాప... ఇంట్లో తలుపులు వేసుకుని ఆమె బారిన పడకుండా బయటపడ్డారు.

నరసరావుపేట మండలం యల్లమందకు చెందిన ఆసియాను చిలకలూరిపేటకు సలాంకి ఇచ్చి వివాహం చేశారు. వీరు లింగంగుంట్లలో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త గ్రామ పరిధిలో ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆసియా అక్క ఫాతిమా తన ముగ్గురు పిల్లలతో చెల్లెలి ఇంటికి వచ్చింది. అప్పుడప్పుడూ మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తించే ఆసియా.... ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్క కొడుకు, ఏడేళ్ల కరిముల్లాపై ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన అక్క కుమార్తె.... ఎనిమిదేళ్ల కరిమున్.... మిగిలిన ముగ్గురు చిన్నారులను గదిలో పెట్టి తలుపులు వేసి ప్రాణాలు కాపాడింది.

చిలకలూరిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆసియాను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని శవపరీక్ష కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అల్పపీడన ప్రభావం.. మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు

ABOUT THE AUTHOR

...view details