వెర్రిచూపులు చూస్తూ.. అమాయకుడిలా కనిపించేలా ఫొటోలు దిగే ఈ యువకుడు.. అత్యంత కిరాతకంగా రెండు హత్యలు చేశాడంటే గ్రామస్థులే నమ్మలేకపోయారు. ఆ హత్యలకు అసహజ శృంగార వికృత చేష్టలే కారణమని తెలిసి పోలీసులే విస్తుపోయారు. ఈ నెల 14న అదృశ్యమై విగతజీవిగా కనిపించిన బాలుని హత్య కేసులో అరెస్టయిన గోపి జీవితంలో ఒళ్లుగగుర్పొడిచే చీకటికోణాలున్నాయి.
గుంటూరు జిల్లాకు చెందిన ఓ బాలుడు.. ఈ నెల 14వ తేదీన అదృశ్యమయ్యాడు. అదే రోజు సాయంత్రం ముళ్లపొదల వద్ద శవమై కనిపించాడు. శరీరంపై గాయాలు, విరిగిన కాళ్లు, చేతులు చూసిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించారు. ఘటనా స్థలంతో పాటు గ్రామంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆధారాల కోసం అన్వేషించారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన గోపి.. బాలుడిని తానే హత్య చేసినట్లు వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయాడు. బాలుడిని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసహజ శృంగారం జరిపాడని.. బయటకు చెప్పేస్తాడనే భయంతో బాలుడి గొంతు నులిమి చంపేశాడని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.