ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తప్పిపోయిన బాలుడిని వెతికి పట్టుకున్న పోలీసులు

By

Published : Oct 17, 2020, 12:41 AM IST

గుంటూరు అర్బన్ పరిధిలో తప్పిపోయిన బాలుడి ఆచూకీని పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కనిపెట్టారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు పనితీరుకు ఆ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

boy missing
boy missing

గుంటూరు కెేవీపీ కాలనీ వద్ద నివాసం ఉంటున్న జొన్నలగడ్డ చెన్నమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు రాజేష్ అనే 13 సంత్సరాల కుమారుడు ఉన్నాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా.. ఎక్కడ ఆచూకీ లభించలేదు. దీంతో తమ కుమారుడు తప్పిపోయాడని బాలుడి తల్లిదండ్రులు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

వెంటనే నగరంపాలెం సీఐ రంగంలోకి దిగి బాలుడు ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్​లకు పంపించారు. బాలుడు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. బాలుడిని విజయవాడ నుంచి గుంటూరు తీసుకువచ్చి విచారించగా.. తాను ఇంటిలో నుంచి ఆడుకుంటూ గుంటూరు బస్ స్టాండ్​కి వెళ్లానని.. అక్కడనుంచి బస్సులో విజయవాడకు చేరుకున్నట్లు బాలుడు చెప్పాడని సీఐ తెలిపారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 3,967 కరోనా కేసులు, 25 మరణాలు

ABOUT THE AUTHOR

...view details