గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ శివారులో ఉన్న ఆక్స్ ఫర్డ్ స్కూల్ సమీపంలోని నీటికుంటలో పడి బాలుడు మృతి చెందాడు. పీడబ్ల్యూ కాలనీకి చెందిన మస్తాన్ కుమారుడు యాసిన్ (12) రంజాన్ సందర్భంగా.. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో కూరుకుపోయిన యాసిన్.. ఎంతకు బయటకు రాకపోవటంతో.. స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ప్రభాకర్ రావు సుమారు 3 గంటల సేపు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహం లభ్యం కావటంతో.. పండగపూట కుమారుడు మృత్యువాత పడటం.. ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
నీటిలో మునిగి బాలుడు మృతి - boy dead to felldown in canal news update
సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు మృత్యువాత పడిన ఘటన.. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ళలో జరిగింది. పండగపూట కుమారుడు మృత్యువాత పడటం.. ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదవశాత్తు ఈతకు వెళ్లి బాలుడు మృతి