వైకాపాలో తగిన గుర్తింపు లేదని ముత్యాల సురేష్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గుంటూరు జిల్లా రామచంద్రపురం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా సూరవరపు పల్లెకి చెందిన మాజీ సర్పంచి కుమారుడైన సురేష్...గురువారం రాత్రి మద్యం తాగి సరిహద్దులో ఉన్న రామచంద్రపురం సెంటర్‌కు వచ్చాడు. టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని చరవాణి ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పర్చూరు వైకాపా ఇంఛార్జి రావి రామనాథం బాబుతో పాటు చిలకలూరిపేట అర్బన్ సీఐ సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సురేష్‌ను కిందకి దిగాలని ఇంఛార్జి రావి రామనాథం విజ్ఞప్తి చేయటంతో...అతను సెల్‌టవర్ దిగి వచ్చాడు. సదరు యువకున్ని రామనాథం తన కారులో తీసుకొని వెళ్లిపోవడం వల్ల కథ సుఖాంతమైంది.
వైకాపాలో గుర్తింపు లేదని...సెల్ టవర్ ఎక్కిన కార్యకర్త - రామచంద్రపురంలో సెల్ టవర్ ఎక్కి యువకుడు బెదిరింపులు
వైకాపాలో తనకు గుర్తింపులేదనే ఆవేదనతో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసుల చొరవతో ఎట్టకేలకు కిందకుదిగివచ్చాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రామచంద్రాపురంలో జరిగింది.

రామచంద్రపురంలో సెల్ టవర్ ఎక్కి యువకుడు బెదిరింపులు
రామచంద్రపురంలో సెల్ టవర్ ఎక్కి యువకుడు బెదిరింపులు