ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించాం' - private

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు భూ కేటాయింపులపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

'ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించాం'

By

Published : Jul 19, 2019, 2:02 PM IST

రాజధాని పరిధిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు భూముల కేటాయింపులపై శాసనమండలిలో చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మూడు ప్రైవేటు యూనివర్శిటీలకు 200 ఎకరాల చొప్పున భూమి కేటాయించారనీ.. ఎకరాకు 50లక్షల ధర నిర్ణయించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫీజు రాయితీలు, రిజర్వేషన్లు పాటించని సంస్థలకు ప్రభుత్వం భూములు ఇవ్వటం సరికాదని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, శ్రీనివాసరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలు రాజధాని ప్రాంతంలో ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే, ఒప్పందంలో ఉన్న ప్రకారమే విశ్వవిద్యాలయాలు నడుస్తాయనీ.. దాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

'ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించాం'

ABOUT THE AUTHOR

...view details