ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Public Opinion on ACCMC: '29 గ్రామాలను కలిపే ఉంచాలి... విడగొడితే ఒప్పుకునేది లేదు' - ఏసీసీఎంసీని వ్యతిరేకించిన బోరుపాలెం గ్రామస్థులు

Amaravati Capital City: అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పాటుపై గ్రామసభలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. 19 గ్రామాలతో కూడిన ఏసీసీఎంసీని బోరుపాలెం ప్రజలు వ్యతిరేకించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 29 గ్రామాలతో కూడిన ఏసీసీఎంసీనే ప్రతిపాదించాలని కోరారు.

Public Opinion on ACCMC
Public Opinion on ACCMC

By

Published : Jan 10, 2022, 7:27 PM IST

Public Opinion on ACCMC: అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పాటుపై గ్రామసభలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటుపై బోరుపాలెంలో గ్రామసభలో ప్రజల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. 29 గ్రామాలను కలిపి ఉంచాలని కోరారు. విడగొడితే ఒప్పుకునేది లేదని బోరుపాలెం గ్రామస్థులు తేల్చిచెప్పారు. మంగళగిరి కార్పొరేషన్ వేళ గ్రామసభలు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.

29 గ్రామాల సంపూర్ణ రాజధానికే తాము అనుకూలమంటూ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం 29 గ్రామాలను అభివృద్ధి చేసిన తర్వాత... అన్నింటినీ కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని.. సభకు హాజరైన వారందరూ తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి:Amaravati Capital City: '19 కాదు.. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details