ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదవాలంటే చదువురావాలి. దాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. చదువురాని వారికి, అంధులకు అది ఒక రకంగా సమస్యే. అందులోని అంశాలను తెలుసుకోవాలన్నా కుదరని పరిస్థితి. అలాంటి వారి కోసం ఓ సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. చిన్నపిల్లలు కూడా విజ్ఞాన పుస్తకాల సారాన్ని ఈ పరికరం ద్వారా సులువుగా నేర్చుకోవచ్చు.
చిన్నపాటి గద రూపంలో ఉండే ఈ పరికరాన్ని పుస్తకంలోని పేజీలపై ఉంచితే...శ్లోకాన్ని వినిపించటంతోపాటు.... దాని అర్థాన్ని వివరిస్తుంది. తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో ఉన్న హనుమాన్ చాలీసాను వినేలా ఈ పరికరం రూపొందించారు. గ్రంథంలోని చిత్రాలపై ఈ గద పెడితే స్తోత్రాలు, జై శ్రీరామ్ శబ్దాలు వినిపిస్తాయి. పక్షులు, జంతువులు, రాక్షసుడు ఇలా భిన్నమైన ధ్వనులు వినిపిస్తాయి. పరికరంలోని సెన్సార్లు ఆయా పేజీలను, అందులోని అంశాలను గుర్తించేలా రూపకల్పన చేశారు.