ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎంపై తెదేపా నేతల విమర్శలు.. విడ్డూరం' - బొల్లా బ్రహ్మనాయుడు తాజా వార్తలు

తెదేపా నేతలు వర్ల రామయ్య, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు... సీఎం జగన్​పై అతస్య ఆరోపణలు చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. అధికార పార్టీపై నిందలు వేయటం మాని పార్టీ బలోపేతంపై తెదేపా నేతలు దృష్టిసారించాలని హితవు పలికారు.

బొల్లా బ్రహ్మనాయడు
బొల్లా బ్రహ్మనాయడు

By

Published : Mar 21, 2021, 5:06 PM IST

ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళ్లటానికి సిద్ధంగా ఉండాలని తెదేపా నేతలు వ్యాఖ్యనించటం విడ్డూరంగా ఉందని గుంటూరు జిల్లా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యానించారు. వారి నాయకుడు చంద్రబాబు ఎన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారో.. ఒక్కసారి గమనిస్తే బాగుంటుందని హితవు పలికారు. సోనియా - చంద్రబాబు ఇద్దరూ కలిసి జగన్​పై తప్పుడు కేసులు బనాయించారని.. వాటిని జగన్ ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు.

తెదేపా నేతలు వర్ల రామయ్య, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు.. సీఎం జగన్​పై అతస్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాకు అభ్యర్థులే కరువైన పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అధికార పార్టీపై నిందలు వేయటం మాని పార్టీ బలోపేతం తెదేపా నేతలు దృష్టిసారించాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details