రాజధాని అమరావతిని పరిరక్షించాలంటూ రాయపూడి వద్ద రాజధాని రైతులు, మహిళలు కృష్ణా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దొండపాడుకు చెందిన మహిళలు పసుపు, కుంకుమలు కృష్ణమ్మకు సమర్పించి మంగళహారతులు ఇచ్చారు. రాజధాని అమరావతి ముంపు ప్రాంతం కాదని, మరోసారి పునరుద్ఘటించారు.
కృష్ణమ్మకు హారతులు... కళ్లకు గంతలు... వినూత్నంగా అమరావతి పోరు - తుళ్లూరులో నిరనస
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 247వ రోజుకు చేరాయి. అమరావతిని పరిరక్షించాలంటూ... రాయపూడిలో మహిళలు కృష్ణా నదికి హారతులు ఇచ్చారు. కళ్లకు గంతలు కట్టుకొని చేతులకు సంకేళ్లు వేసుకొని నిరసన తెలిపారు.
అమరావతిని పరిరక్షించాలంటూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
తుళ్లూరులో మహిళలు, భూములిచ్చిన రైతులు... కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభత్వం నిర్ణయం మార్చుకునేంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.
గుంటూరులో రిజిస్ట్రేషన్ కార్డులు సప్లై ఆలస్యం
Last Updated : Aug 20, 2020, 5:28 PM IST