ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్తీ బ్లీచింగ్ పౌడర్ కలకలం...కల్తీ కాదని తేల్చిన అధికారులు ! - bleaching powder scam

కరోనా కట్టడికి బ్లీచింగ్​కు బదులు మైదా పిండి చల్లుతున్నారని స్థానికులు ఆరోపణలు చేయటంతో గుంటూరు కార్పొరేషన్ అధికారులు కలవరపాటుకు గురయ్యారు. అది మైదా పిండి కాదని...హైడ్రేటెడ్ లైం పౌడర్ (సున్నం) అని తేల్చారు. నిరాధారాలతో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ హెచ్చరించారు.

కల్తీ బ్లీచింగ్ పౌడర్ కలకలం...కల్తీ కాదని తేల్చిన అధికారులు !
కల్తీ బ్లీచింగ్ పౌడర్ కలకలం...కల్తీ కాదని తేల్చిన అధికారులు !

By

Published : Jun 5, 2020, 1:39 PM IST

కల్తీ బ్లీచింగ్ పై వస్తున్న కథనాలతో గుంటూరు కార్పొరేషన్ అధికారులు కలవరపాటుకు గురవుతున్నారు. తాజాగా గుంటూరు సంపంత్​నగర్​లో మైదా పిండి, బ్లీచింగ్ కలిపి వీధులలో చల్లుతున్నారని స్థానికులు ఆరోపించారు. కరోనా సమయంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది సంపత్ నగర్​కు చేరుకుని బ్లీచింగ్ పౌడర్​ను పరిశీలించారు. అది మైదా పిండి కాదని సున్నం అని తేల్చారు. స్థానికుల ఆరోపణలను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తీవ్రంగా ఖండించారు.

సంపత్ నగర్ శివాలయం రోడ్డులో బ్లీచింగ్ చల్లాడానికి సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ హైడ్రేటెడ్ లైం పౌడర్ (సున్నం) రోడ్డునకు నిర్దేశిత కార్నర్ లో ఉంచడమైందన్నారు. 3 కట్టల సున్నం, ఒక కట్ట బ్లీచింగ్ నిష్పత్తిలో కలిపి పరిసరాల్లో చల్లించటం జరింగదన్నారు. నిరాధారాలతో, అవగాహనరాహిత్యంతో స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారన్నారు.అవాస్తవ కథనాలు ప్రచారం చేసిన వారిపైన నగర పాలక సంస్థ న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని కమిషనర్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details