గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్‌కు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. చికిత్స తీసుకున్న అనంతరం ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి ఇంటికి వచ్చినప్పటి నుంచి తల, కనుగుడ్లు నొప్పి రావటంతో... స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయిందని వైద్యులు తెలిపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తెనాలిలో బ్లాక్ ఫంగస్... అవాస్తవమన్న వైద్యాధికారులు - black fungus disease registered in guntur district
గుంటూరు జిల్లా తెనాలిలో బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిందని వస్తున్న వార్తలు అవాస్తవమని డిప్యూటీ డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ తెలిపారు. పట్టణానికి చెందిన ఓ మహిళ కంటి సమస్యతో బాధపడుతోందని, ఆమెకు వచ్చిన వైద్య నివేదికలో బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అవలేదని తెలిపారు.
తెనాలిలో బ్లాక్ ఫంగస్
ఈ క్రమంలో మహిళకు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిందని వస్తున్న కథనాలు పూర్తి అవాస్తవమని డిప్యూటీ డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ అన్నారు. ఆమెకు కంటి సమస్యలు ఉన్నాయని, వైద్యులు ఇచ్చిన నివేదికలోనూ బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు నమోదవలేదని తెలిపారు.
ఇదీచదవండి.