గుంటూరులో మసీదులు, చర్చిలు ప్రతిష్ట కార్యక్రమాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్లడం సరికాదని భాజపా యువమెుర్చా జిల్లా అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాస్ అన్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి వెల్లంపల్లి అన్యమతాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే సీఎం జగన్ స్పందించి మంత్రి వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో భాజపా యువమెుర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
'మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలి' - BJP YUVA MORCHA MEDIA CONFERENCE IN GUNTUR
హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను తక్షణమే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని భాజపా యువమెుర్ఛా జిల్లా అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
భాజపా యువమెుర్ఛ జిల్లా అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాస్
ఇవీ చదవండి