గుంటూరు బొంగరాలబీడు శ్మశానవాటికను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సందర్శించారు. ఈ క్రమంలో మృతదేహాలకు ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న అమ్మ ఛారిట బుల్ ట్రస్టు సేవలను కొనియాడారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు స్వామి జ్ఞానప్రసన్న గిరి సేవలను గుర్తుచేశారు. భవిష్యత్తులో ఆయన సేవలకు అండగా ఉంటామని.. ఏం చేయాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సోము వీర్రాజు చెప్పారు.
అమ్మఛారిటబుల్ ట్రస్టు స్వచ్ఛంద సేవలు స్పూర్తిదాయకం: సోము వీర్రాజు - latest news in guntur
కరోనా కష్టకాలంలో అమ్మఛారిటబుల్ ట్రస్టు స్వచ్ఛంద సేవలు స్పూర్తిదాయకమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశంసించారు. భవిష్యత్తులో వారి సేవలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.
![అమ్మఛారిటబుల్ ట్రస్టు స్వచ్ఛంద సేవలు స్పూర్తిదాయకం: సోము వీర్రాజు BJP state president Somu veeraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-31-15h32m23s854-3105newsroom-1622455425-172.jpg)
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు