గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భాజపా జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, మద్యం, గనుల మాఫియాపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. ఈ మూడు మాఫియాల రాజ్యాన్ని తీవ్రంగా ఎండగడతామన్నారు. సంఘటన పరంగా బలోపేతం అవుతూ మండల స్థాయిలో భాజపా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం: సోము వీర్రాజు - BJP state president Somu veeraju latest news
ఇసుక, మద్యం, గనుల మాఫియాపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.
![పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం: సోము వీర్రాజు BJP state president Somu veeraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12314083-539-12314083-1625062399824.jpg)
భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు