రాజధాని విషయంలో ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీకీ శాస్త్రీయత లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రాజధాని ప్రాంత రైతులను మోసం చేశారని ఆరోపించారు. రాజధాని కోసం ఇప్పటికే వేలాది కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని... ఇప్పుడు మళ్లీ మార్చడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. రాజకీయ కక్షతో రాజధానిని మార్చి ప్రజలకు అన్యాయం చేయొద్దంటున్న కన్నాతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'ముఖ్యమంత్రి మారినప్పుడల్లా... రాజధానిని మారుస్తారా..?' - bjp kanna laxmi narayana face to face interviews on gn rao committee report
రాజధాని విషయంలో ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. రాజధాని కోసం ఇప్పటికే కేంద్రం నిధులు కేటాాయించిందని... ఇప్పుడు కేంద్రానికి సంబంధం లేదని మంత్రులు అనడం సరికాదని అన్నారు. రాజధాని ప్రాంత రైతులను ముఖ్యమంత్రి మోసం చేశారని విమర్శించారు.
'ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా..?