ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి భాజపా కృషి చేస్తోంది: రాంమాధవ్ - bjp sankalpa yatra news updates in guntur

భాజపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమం గుంటూరులో నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కన్నా నివాసం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ చేశారు.

bjp-sankalpa-yatra-closed-in-guntur

By

Published : Oct 30, 2019, 4:23 PM IST

గుంటూరులో గాంధీ సంకల్పయాత్ర ముగింపు

రాజధాని ప్రాంత రైతుల ఇక్కట్లు దూరం చేసేందుకు... భాజపా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలవరం మొదలుకొని... ఇసుక కొరత వరకు అనేక సమస్యలున్నాయని పేర్కొన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి భాజపా కృషి చేస్తుందని రాంమాధవ్‌ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులు ఆయన్ని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. కేంద్రం స్పందించి రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ నివాసం నుంచి లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ కూడలి వరకు... భారీ ర్యాలీ నిర్వహించారు.

గుంటూరులో గాంధీ సంకల్పయాత్ర

ABOUT THE AUTHOR

...view details