ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మోదీ వల్లే భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు' - bjp leader revela kishore babu paricipated in snakalp yatra in guntur

ప్రధాని మోదీ వల్లే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మాజీ మంత్రి, భాజపా నాయకులు రావెల కిశోర్​బాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో గాంధీజీ సంకల్ప యాత్రను భాజపా నాయకులు నిర్వహించారు.

'మోదీ సంస్కరణల వల్లే ప్రపంచ దేశాలు భారత్​వైపు చూస్తున్నాయి'

By

Published : Oct 20, 2019, 5:51 PM IST

Updated : Oct 20, 2019, 7:45 PM IST

'మోదీ వల్లే భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు'

ప్రధాని మోదీ చేస్తోన్న ఆర్థిక అభివృద్ధి వల్లే నేడు ప్రపంచ దేశాలన్నీ భారత్​ వైపు చూస్తున్నాయని భాజపా నాయకుడు రావెల కిశోర్​బాబు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాల్లో గాంధీజీ సంకల్ప యాత్రను భాజపా నాయకులు నిర్వహించారు. భారతదేశాన్ని అన్ని విధాలుగా అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని చెప్పారు. గాంధీ ఆశయాలతో పాలన చేస్తున్నారని కొనియాడారు.

Last Updated : Oct 20, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details