దేశంలో సుపరిపాలన కొనసాగాలంటే.. మరోసారిమోదీ నాయకత్వాన్ని బలపరచాలని గుంటూరు పశ్చిమ భాజపా అభ్యర్థి మాధవిలత ఓటర్లను కోరారు.గుంటూరు కొరిటిపాడులో ఇంటింటికీతిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి కంటే మోదీ వచ్చిన 5 ఏళ్లలో ఎక్కువగా జరిగిందని తెలిపారు. మరోసారి కేంద్రంలో, రాష్ట్రంలో కూడా భాజపాకు ఓటు వేసి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి.