కోడెల కుటుంబీకులకు.. సుజనా, మోత్కుపల్లి పరామర్శ - bjp mp sujana chowdary
మాజీ సభాపతి, దివంగత కోడెల శివప్రసాదరావు సేవలను.. భాజపీ ఎంపీ సుజనా చౌదరి, తెదేపా తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు స్మరించుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని ఆవేదన చెందారు. కోడెల కుటుంబాన్ని పరామర్శించారు.
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుటుంబీకులను భాజపా ఎంపీ సుజనా చౌదరి, తెదేపా తెలంగాణ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు.. గుంటూరు జిల్లా నరసారావుపేటలో పరామర్శించారు. కోడెల చిత్రపటానికి నివాళి అర్పించారు. నరసారావుపేట, సత్తెనపల్లి అభివృద్ధి కోడెల చలవే అని సుజనా గుర్తు చేసుకున్నారు. మహిళలు రాజకీయాల్లోకి వచ్చేలా ఎంతో ప్రోత్సహించారని అన్నారు. ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టమైన నాయకుల్లో కొడెల ఒకరని మోత్కుపల్లి చెప్పారు. వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడైన కోడెల మరణం.. ఎంతో బాధించిందన్నారు.