నరసరావుపేటను ఒక జిల్లాగా భాజపా గుర్తించినట్లు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. పార్లమెంట్లలోని నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించేందుకు భాజపా సముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. సీఏఏ, ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా చేస్తున్న అల్లర్ల వెనుకు పాకిస్థాన్ టెర్రరిస్టులు ఉన్నారనే అనుమానం ఉందన్నారు. పౌరుసత్వ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు, అసాంఘిక శక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రావటం ఒక చారిత్రక ఘట్టమన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం భాజపా కట్టుబడి ఉందని అన్నారు.
పౌరుసత్వ బిల్లుపై అసాంఘిక శక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి - భాజాపా ఎంపీ జీవీఎల్ ప్రెస్మీట్
సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులపై కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తుందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దేశ ప్రజల రక్షణ కోసం భాజపా కట్టుబడి ఉందని అన్నారు.
పౌరుసత్వ బిల్లుపై అసాంఘిక శక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి