GVL on Palnadu Development: పల్నాడు అభివృద్ధే తమ ధ్యేయమని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. నరసరావుపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రతిపాదనలను త్వరతగతిన పూర్తి చేసేలా కేంద్రంతో చర్చిస్తానన్నారు. అభివృద్ధిలో పల్నాడు నిర్లక్ష్యానికి గురైందన్న ఆయన.. కేంద్ర పథకాలు ప్రతిఒక్కరికీ అందాలన్నారు.
GVL on Palnadu Development: పల్నాడు అభివృద్ధే మా ధ్యేయం: జీవీఎల్ - పల్నాడుపై జీవీఎల్ కామెంట్స్
MP GVL on Palnadu Development: అభివృద్ధిలో పల్నాడు ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. పల్నాడు అభివృద్ధే తమ ధ్యేయమని ఆయన వ్యాఖ్యనించారు.
నరసరావుపేటలో రహదారుల అభివృద్ధికి, రైల్వే కనెక్టివిటీకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినుకొండ-గుంటూరు 544 D నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. పిడుగురాళ్ల - నరసరావుపేట 167 A రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. నరసరావుపేట-నకరికల్లు వరకూ 237 కోట్లతో రైల్వే లింక్లైన్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. నరసరావుపేటలో కృషివిజ్ఞాన కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం స్థలకేటాయింపులో ఆలస్యం చేస్తోందని జీవీఎల్ ఆరోపించారు.
venkaiah naidu news: 'ప్రజాస్వామ్యాన్ని అవినీతి నాశనం చేస్తోంది'