ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: జీవీఎల్ నరసింహారావు - భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు

GVL Fire On KCR: ఆంధ్రులను అవమానపరచిన కేసీఆర్.. ఏపీకి వచ్చి రాజకీయాలు చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని భాజపా ఎంపీ జీవీఎస్ నరసింహరావు డిమాండ్ చేశారు. ఆంధ్రాప్రజలను కేసీఆర్ భూతులు తిట్టారని అన్నారు.

BJP MP GVL Narasimha Rao
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు

By

Published : Jan 21, 2023, 7:24 PM IST

GVL Fire On KCR: కేసీఆర్ ఏపీకి వచ్చి రాజకీయాలు చేసే ముందు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా కేసీఆర్ గతంలో వ్యాఖ్యాలు చేశారని జీవీఎల్ గుర్తు చేశారు. కేసీఆర్ రాజకీయ అస్త్ర సన్యాసం చేయడం ఖాయమని.. తామే ఇంటికి సాగనంపుతామని చెప్పారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం తన వాటా నిధులు, భూమి ఇవ్వడానికి తీవ్ర జాప్యం చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అభివృద్ధి పనులు జోరందుకునే అవకాశం ఉందని అన్నారు. ఏపీలో సోము వీర్రాజు నేతృత్వంలో తమ పార్టీ ముందుకు దూసుకుపోతుందని చెప్పారు.

"కేసీఆర్ ఆంధ్రప్రదేశ్​లో అడుగుపెట్టే ముందు.. ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆంధ్రప్రదేశ్​లోకి రావాలి. ఆంధ్రా ప్రజలను అవమానపరచి.. భూతులు తిట్టి.. రాజకీయ పబ్బం గడుపుకున్నారు. కానీ ఈ రోజు ఆంధ్రావాళ్ల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్న కేసీఆర్.. క్షమాపణలు చెప్పి.. ఆంధ్రాలోకి రావాలి". - జీవీఎల్ నరసింహారావు, భాజపా ఎంపీ

కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవీఎల్ నరసింహారావు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details