ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BJP MP GVL: 'ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్లే రైల్వే పనులు నిలిచాయి'

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ గుంటూరు జిల్లాలోని వినుకొండ రైల్వే స్టేషన్​ను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్ల అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. ప్రయాణికులకు వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.

BJP MP GVL
BJP MP GVL

By

Published : Oct 7, 2021, 10:42 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ రైల్వే స్టేషన్‌ను ఎంపీ జీవీఎల్ పరిశీలించారు. స్టేషన్​లోని రైల్వే ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే శాఖతో రాష్ట్ర ప్రభుత్వ చేసుకున్న ఒప్పందం ప్రకారం నిధులు మంజూరులో జాప్యం చేయడం వల్ల 10 రైల్వే ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో ఉన్న ఒప్పందం మేరకు మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వలన అనేక రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల మౌలిక వసతులు దూరం అవుతున్నాయని అన్నారు.

నరసరావుపేట, రెంటచింతల, పిడుగురాళ్ల, నడికుడి, మాచర్ల, వినుకొండ రైల్వే స్టేషన్ ను సందర్శించానని.. ప్రయాణికులకు మౌలిక వసతులు లేక పడుతున్న ఇబ్బందులను గమనించినట్లు తెలిపారు. ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలను వసతుల కల్పనకు కేటాయించినట్లు చెప్పారు. రైల్వే శాఖతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అభివృద్ధి పనులు చేసే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు. రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రేపు డీఆర్ఎం సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details