గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో భాజపా కార్యాలయాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా స్థానిక పార్టీలపై ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర నిధులతో నిర్మించిన శ్మశానవాటికల ప్రహారి గోడలకు అప్పటి ప్రభుత్వం పసుపు రంగు పూస్తే.... ఇప్పటి వైకాపా ప్రభుత్వం తమ రంగు వేస్తుందని ఆరోపించారు. కోడెల కుటుంబంపై కమిషన్ వేసి అక్రమాలు అన్ని బయట పెట్టాలని... మందుల దగ్గర నుంచి పశువుల పచ్చి గడ్డి వరకు అవినీతి చేశారని వీర్రాజు విమర్శించారు.
'కొంతమందిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు' - guntur, prathipadu
గుంటూరు జిల్లాలో నూతన భాజపా కార్యాలయాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు కురిపించారు.
నీరు-చెట్టు కార్యక్రమంలో 23వేల కోట్లు అవినీతి జరిగిందని సోము వీర్రాజు అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు టీడీపీ నాయకులు స్వాహా చేశారని.. దీనిపై సీఎం జగన్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి చంద్రబాబు అవినీతి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొంతమందిపై అక్రమంగా కేసులు పెడుతుందని...సమపాలన చేస్తారని ప్రజలు అధికారం ఇచ్చారని హితవు పలికారు. జాతీయ పథకాలకు గాంధీ బొమ్మలు ఉండాలి సోము వీర్రాజు అన్నారు. ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో కొందరు వైసీపీ, తెదేపా నాయకులు భాజపాలో చేరారు.
ఇది చూడండి: అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన హోంమంత్రి