పంచాయతీ ఎన్నికల్లో బలవంతంగా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గతంలో టెండర్ పత్రాలను దొంగలించడం చూశాం కానీ.. నామినేషన్లు పత్రాలను దోచుకెళ్లడం మాత్రం చూడలేదని చెప్పారు.
రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చామని రెచ్చిపోతున్న వైకాపా ప్రభుత్వానికి అదే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కన్నా హెచ్చరించారు.