గుంటూరు జిల్లా మంగళగిరి లోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లిన భాజపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయం వెలుపల ఆ పార్టీ నాయకురాలు సాధినేని యామినితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
దేవాలయాలకు వెళ్తే అరెస్ట్ చేస్తారా అని పోలీసులను... యామిని ప్రశ్నించారు. ఏ నేరం చేశామో చెప్పాలని నిలదీశారు. పార్టీకి సంబంధించిన విషయాలను ప్రస్తావించకుండా... గుడి వద్ద ఫొటోలు తీసుకుంటుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. దైవ దర్శనం చేసుకుని బయటకు వస్తే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామిక చర్య అని ఆగ్రహించారు. శాంతి భద్రతలకు తాము విఘాతం కల్గించలేదని స్పష్టం చేశారు.