ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధాని తరలిపు విషయంలో వైకాపాకు పరాభవం తప్పదు' - గుంటూరు జిల్లా తాజా వార్తలు

200 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న అమరావతి రైతుల దీక్షకు భాజపా నేతలు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ విఫలమైందని... అలాగే రాజధాని విషయంలోనూ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

BJP leaders Solidarity for Amaravati initiation at guntur district
గుంటూరులో అమరావతి రైతుల దీక్షకు భాజపా నేతలు సంఘీభావం

By

Published : Jul 4, 2020, 2:27 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ 200 రోజులుగా... రైతులు చేస్తున్న ఉద్యమానికి భాజపా నేతలు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా భాజపా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజు ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటివరకు అన్ని రంగాలలో ఘోర వైఫల్యం చెందిందని జూపూడి రంగరాజు అన్నారు. ఇప్పటికే 63సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎలాంటి మార్పు రాలేదన్నాదని విమర్శించారు. ప్రభుత్వానికి రాజధాని విషయంలో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రాజధాని రైతులకు భాజపా అండగా ఉంటుందని.. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details